Skip to main content

Posts

Showing posts with the label NeevuThodaiyundagaaYesu

మారిపోయెనే నా పాపపు మనసు | Maaripoyene Naa Paapapu Manasu

మారిపోయెనే నా పాపపు మనసు In Telugu పాట రచయిత:  మేరి సౌమ్య అందనం Lyricist:  Mary Sowmya Andanam మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా  (2)                 ||మారిపోయెనే|| సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా  (2) పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా          ||మారిపోయెనే|| యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా  (2) యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా          ||మారిపోయెనే|| Maaripoyene Naa Paapapu Manasu In English Maaripoyene Naa Paapapu Manasu – Siluvalo Ninnu Chooda Karigipoyene Naa Katina Hrudayam – Kaluv...

నీవు తోడైయుండగా యేసు | Neevu Thodaiyundagaa Yesu

నీవు తోడైయుండగా యేసు In Telugu పాట రచయిత:  జాషువా కట్ట Lyricist:  Joshua Katta నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ            ||నీవు తోడైయుండగా|| గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి            ||నీవు తోడైయుండగా|| ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా – శక్తి  క్షీణించిపోయినా వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి            ||నీవు తోడైయుండగా|| నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను Neevu Thodaiyundagaa Yesu In English Neevu Thodaiyundagaa Yesu – Bhayamu Ledu Ilalo Melu Cheyu Devudaa Neeku – Saati Leru Srushtilo Ekkaleni Kondalennō Edurochchinanu Le...