మారిపోయెనే నా పాపపు మనసు In Telugu పాట రచయిత: మేరి సౌమ్య అందనం Lyricist: Mary Sowmya Andanam మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే|| సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2) పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా (2) యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| Maaripoyene Naa Paapapu Manasu In English Maaripoyene Naa Paapapu Manasu – Siluvalo Ninnu Chooda Karigipoyene Naa Katina Hrudayam – Kaluv...
Aradhana neeke aradhana telugu lyrics పాట రచయిత: షాలోమ్ బెన్హర్ మండ Lyricist: Shalom Benhur Manda పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే (2) నీ నామమునే స్తుతియించెదా నీ నామమునే ఘనపరచెదా (2) నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన నీకే – ఆరాధన నీకే ఆరాధన నీకే (2) నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన|| Aaraadhana Neeke Lyrics In English Parishuddhudaa Paavanudaa Athyunnathudaa Neeve (2) Nee Naamamune Sthuthiyinchedaa Nee Naamamune Ghanaparachedaa (2) Neelone Rakshana Neelone Nireekshana Neelone Vijayamu Neelone Santhosham Aaraadhana Neeke – Aaraadhana Neeke Aaraadhana Neeke (2) Naa Adugulo Adugai Naa Shwaasalo Shwaasai Ne Nadachina Velalo Prathi Adugai (2) Naa Oopiri Naa Gaanamu Na...