Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...
Jeevaharamu Rammu Lyrics జీవాహారము రమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద దీర్చుము జీవనపథములో చీకటి పడువేళ జీర్ణించు కొనిపోవు జీవితాశలఁ బెంచ ||జీవా|| 1. విందుగృహమునకేగి వీక్షింతు భ్రమతో నీ వివిధసుభోజ్యంబులన్ విచ్ఛిన్నమైన నీ విమల దేహపు విందు వికలంబౌ మనసుతో వినుతించి, తినుచుందు ||జీవా|| 2. రుధిర ధారలలోన ఋజువౌ నీ ప్రేమలు రూపుమాయును పాపము ఋతద్రాక్ష వల్లీ నీ రుధిరపానముచేత ఋణభారములు దీరి రుచి యించు నా బ్రతుకు ||జీవా|| 3. భవదీయ స్మరణార్థం పతితుల శరణార్థం ఫలియించు యీహోమము ప్రభువా నాయాత్మలో ప్రతిబింబమై వెలసి పానార్పణంబౌను ప్రతిరక్త బిందువు ||జీవా|| 4. ఆత్మాంతఃపురములో ఆంతర్య గదిలోన ఆరాధించు నీ నామము అలనాటి నీ రక్త నవనిబంధన నేడు అపురూపమై నాలో నవతరించును దేవా ||జీవా|| Jeevaharamu Rammu Lyrics in English jeevaahaaramu rammu chirajeevaannamu nichchi jeevitha kShudha dheerchumu jeevanapaThamuloa cheekati paduvaeLa jeerNiMchu konipoavu jeevithaashalAO beMcha ||jeevaa|| 1. viMdhugruhamunakaegi veekShiMthu bhramathoa nee viviDhasubhoajyMbulan vichChinnamaina nee vimala dhaehapu viMdhu vikalMbau ma...