Skip to main content

Posts

Showing posts with the label నీవు తప్ప నాకు ఇలలో

నీ దయలో నీ కృపలో | Nee Dayalo Nee Krupalo Lyrics

Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా…            ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ  (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు  (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా            ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి  (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని  (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా             ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...

Neevu Thappa Naku Ilalo Evarunnarayya Song Lyrics | నీవు తప్ప నాకు ఇలలో

  పాట రచయిత:  ఫిలిప్ ప్రకాష్ Lyricist:  Phillip Prakash Neevu Thappa Naku Ilalo Evarunnarayya lyrics in Telugu నీవు తప్ప నాకు ఇలలో ఎవరున్నారయ్యా నీ ప్రేమ కన్నా సాటి భువిపై ఏదీ లేదయ్యా నువ్వంటూ లేకుంటే నే బ్రతుకలేనయ్యా నేనిలా ఉన్నానంటే నీ దయేనయ్యా నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా గుండె నిండ నిండున్నావు ఓ నా యేసయ్యా       ||నీవు తప్ప|| కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు ఈ లోకమంతా వెలివేస్తున్న నీ ప్రేమ నాపై చూపించినావు నీ అరచేతిలో నను దాచినావయ్యా నా చేయి విడువక నను నడిపినావయ్యా నా తోడై నా నీడై వెంటుంటే చాలయ్యా           ||నువ్వంటూ|| కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్య కరమే అందించినావు ఆ సిలువలోనే నీ ప్రాణమును నను రక్షింప అర్పించినావు నీ కృప నీడలో నను కాచినావయ్యా ఒక క్షణము వీడక కాపాడినావయ్యా నా శ్వాసై నా ధ్యాసై నువ్వుంటే చాలయ్యా           ||నువ్వంటూ|| Neevu Thappa Naku ilalo Evarunnarayya Song In English Neevu Thappa Naaku Ilalo Evarunnaarayyaa Nee Prema Kanna Saati Bhuvipai Yedee Ledaayy...