Nee dayalo nee krupalo lyrics in telugu నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము నీ ఆత్మతో నను నింపుమా నీ సేవలో ఫలియింపగా దేవా… దేవా… ||నీ దయ|| కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదించగా ప్రాణ హితులే నన్ను విడచి వెలిగ నను చూడగ (2) ఓదార్పువై నా చెంత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు (2) ఏమి అద్బుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవె నా మార్గము – నీవె నా జీవము నీవె నా గమ్యము – నీవె నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా ||నీ దయ|| ఏ యొగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి (2) నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడ వరకు నిలవాలని (2) నా మది నిండెను ఆశతో నే పాడెద స్తుతి గీతం నీవె నా తోడుగా – నీవె నా నీడగా ఆత్మతో నింపుమా – శక్తి నా కొసగుమా నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా ||నీ దయ|| Nee dayalo nee krupalo lyrics english Nee Dayalo Nee Krupalo Kaachithiv...
పాట రచయిత: షాలోమ్ బెన్హర్ మండ Lyricist: Shalom Benhur Manda Aradhana neeke aradhana telugu lyrics in translation పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే (2) నీ నామమునే స్తుతియించెదా నీ నామమునే ఘనపరచెదా (2) నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన నీకే – ఆరాధన నీకే ఆరాధన నీకే (2) నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడచిన వేళలో ప్రతి అడుగై (2) నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నను నింపు బలవంతుడా (2) ||ఆరాధన|| Aradhana neeke lyrics in english translation Parishuddhudaa Paavanudaa Athyunnathudaa Neeve (2) Nee Naamamune Sthuthiyinchedaa Nee Naamamune Ghanaparachedaa (2) Neelone Rakshana Neelone Nireekshana Neelone Vijayamu Neelone Santhosham Aaraadhana Neeke – Aaraadhana Neeke Aaraadhana Neeke (2) Naa Adugulo Adugai Naa Shwaasalo Shwaasai Ne Nadachina Velalo Prathi Adugai (2) ...