Enni Thalachina Song Lyrics In Telugu Translation ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని|| Enni Thalachina Song Lyrics In English Language Enni Thalachinaa Edi Adiginaa Jariged...
పాట రచయిత: జాషువా కట్ట Lyricist: Joshua Katta Neevu thodai undaga yesu lyrics translation నీవు తోడైయుండగా యేసు In Telugu నీవు తోడైయుండగా యేసు – భయము లేదు ఇలలో మేలు చేయు దేవుడా నీకు – సాటి లేరు సృష్టిలో ఎక్కలేని కొండలెన్నో ఎదురొచ్చిననూ లెక్కలేని నిందలే నన్ను బాధించిననూ ||నీవు తోడైయుండగా|| గతం గాయాన్ని చేయగా – గాయం హృదయాన్ని చీల్చగా శోకం సంద్రంలా ముంచగా – లోకం బంధాలే తెంచగా పేరు పెట్టి తల్లిలా పిలచి లాలించితివి నీవే తోడు నీడగా నిలచి కృప చూపితివి ||నీవు తోడైయుండగా|| ఆశ నిరాశగా మారినా – నిరాశ నిస్పృహ పెంచినా యుక్తి తెలియక తిరిగినా – శక్తి క్షీణించిపోయినా వెన్ను తట్టి తండ్రిలా నిలిపి నడిపించితివి నీవే కొండ కోటగా నిలిచి బలపరచితివి ||నీవు తోడైయుండగా|| నీవు నాకు అండగా నిలచి – దారి చూపినావయ్యా నేను నీకు మెండుగా స్తుతులు – అర్పించెదను Neevu thodai undaga yesu lyrics english translation Neevu Thodaiyundagaa Yesu – Bhayamu Ledu Ilalo Melu Cheyu Devudaa Neeku –...